హైదరాబాద్ అభివృద్ధిపై రేవంత్‌ రెడ్డి కీలక నిర్ణయం?

Chakravarthi Kalyan
హైదరాబాద్ ప్రగతిలో కీలక మైలు రాయిలాంటి నిర్ణయం రేవంత్ రెడ్డి సర్కారు తీసుకుంది. హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థపై ప్రత్యేక దృష్టి సారించిన కాంగ్రెస్ సర్కారు నగర అభివృద్ధిలో హెచ్ఎండీఏ పాత్ర కీలకం కావడంతో ఆ సంస్థను పటిష్టం చేయాలని నిర్ణయించింది. నగరంలోని మూడు వేరు వేరు చోట్ల నుంచి పనిచేస్తున్న హెచ్ఎండీఏ కార్యాలయాలపై కూడా దృష్టి సారించిన రేవంత్ రెడ్డి... వాటన్నింటిని ఒకేచోటకు తరలించాలని ఎండీ దానకిషోర్ ను ఆదేశించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు హెచ్ఎండీఏను బేగంపేటలోని పైగా ప్యాలెస్ కు తరలిస్తున్నట్లు దాన కిషోర్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుత ప్రధాన కార్యాలయం అమీర్ పేట లోని స్వర్ణ జయంతి కాంప్లెక్స్ లో ఉంది. ట్యాంక్ బండ్ వద్ద బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు, నానక్ రాంగూడ లో హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్, అర్బన్ ఫారెస్టు కార్యాలయాలు పనిచేస్తున్నాయి. ఇక నుంచి ఆ మూడు కూడా పైగా ప్యాలెస్ లోని మూడు భవనాల్లోకి మారనున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: