ఇవాళ్టి నుంచి అమల్లోకి మరో గ్యారంటీ?

Chakravarthi Kalyan
ఆరు గ్యారంటీల్లోని 13 కార్యక్రమాల్లో మరో పథకానికి ప్రభుత్వం ఇవాళ  రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రాచలంలో ప్రారంభిస్తారు. డిఫ్యూటీ సీఎం భట్టి విక్రమార్క, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచే ఈ పథకం లాంఛనంగా ప్రారంభించనున్నారు. ప్రత్యేక హెలికాప్టర్‌లో సారపాక చేరుకోనున్న సీఎం రేవంత్ రెడ్డి అక్కడి నుంచి రోడ్డు మార్గంలో భద్రాచలం వచ్చి భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు.
తర్వాత భద్రాచలం మార్కెట్ యార్డులో సుమారు 5 వేల మంది మహిళల సమక్షంలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభిస్తారు. ఆ తర్వాత భద్రాచలం ఆలయ అభివృద్ధిపై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. ఈ ఇందిరమ్మ పథకంలో పేదలకు స్థలంతో పాటు ఐదు లక్షల రూపాయలు ఇస్తారు. మొదటి విడతలో సొంత స్థలం ఉన్నవారికి ఐదు లక్షలు ఇచ్చే కార్యక్రమాన్ని  ప్రారంభిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: