కాసుకో జగన్‌: టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తు ఖరారు

Chakravarthi Kalyan
సార్వత్రిక ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి ముందుకు సాగాలని బీజేపీ, టీడీపీ, జనసేన నిర్ణయించాయి. ఈ మేరకు మూడు పార్టీల సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. దేశ ప్రగతికి, రాష్ట్ర ప్రజల అభ్యున్నతికి ప్రధాని మోదీ తో పాటు మూడు పార్టీలు కట్టుబడి ఉన్నాయని ప్రకటన విడుదల చేశాయి. ఏపీలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించాయి. నరేంద్ర మోదీ గత 10 ఏళ్లుగా దేశ ప్రగతి కోసం అవిశ్రాంతంగా పని చేస్తున్నారని.. బీజేపీతో టీడీపీ జనసేన కలిసి రావడం ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలను చేరుకోవడానికి దోహదపడుతుందని అంటున్నాయి.

బిజెపి టీడీపీ మధ్య అనుబంధం చాలా పాతదని.. 1996లో టీడీపీ ఎన్డీయేలో చేరిందని.. వాజ్ పేయి, నరేంద్ర మోదీ ప్రభుత్వంలో కలిసి విజయవంతంగా పని చేశాయని.. 2014 లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లోనూ టిడిపి బీజేపీ కలిసి పోటీ చేశాయని.. 2014 సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి, టిడిపి కూటమికి జనసేన  మద్దతు ఇచ్చిందని గుర్తు చేస్తున్నాయి. సీట్ల పంపకానికి సంబంధించిన విధి విధానాలను ఒకటి రెండు రోజుల్లో ఖరారు చేస్తామని తెలిపాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: