కేరళ సర్కారు ఓటీటీ.. రూ.75 కే సినిమా చూడొచ్చు?

Chakravarthi Kalyan
దేశంలోనే తొలిసారిగా ఓ రాష్ట్ర ప్రభుత్వం ఓటీటీని ప్రారంభించింది. కేరళ ప్రభుత్వం సీస్పేస్‌ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ను నిన్న ప్రారంభించారు. ఈ సీస్పేస్‌ మలయాళం భాషా సంస్కృతిని ప్రోత్సహిస్తుంది. సీస్పేస్‌ ఓటీటీలో పే-పర్‌-వ్యూ ఆధారంగా సబ్‌ స్క్రైబర్లు సినిమాలను చూడొచ్చు. నెలనెలా డబ్బు కట్టక్కర్లేదు. రూ.75 కే సినిమా చూసే అవకాశం ఉంది. కంటెంట్‌ మొత్తానికి ప్రేక్షకులు చెల్లించాల్సిన అవసరం లేకుండా చూసిన సినిమాలకే డబ్బు కట్టొచ్చు.

అంతే కాదు.. 40 నిమిషాల షార్ట్‌ ఫిల్మ్‌లు 40 రూపాయలు చెల్లిస్తే చాలు. 30 నిమిషాల ఫిల్మ్‌లు 30 రూ. 20 నిమిషాల ఫిల్మ్‌లు 20 రూ. కూడా చెల్లించి చూడొచ్చు. ఈ ఓటీటీలో అవార్డులు గెలుచుకున్న సినిమాలు, ఫిల్మ్‌ అకాడమీ చిత్రాలు, డాక్యుమెంటరీలు, షార్ట్‌ ఫిల్మ్‌లు, ప్రయోగాత్మక చిత్రాలు ఉంచుతారు. ఓటీటీ ఆదాయంలో సగం ఫిల్మ్‌ అకాడమీకి వెళ్తుంది.  మిగిలిన సగం నిర్మాతకు వెళ్తుంది. కొత్త డైరెక్టర్లు తమ చిత్రాల కోసం సీస్పేస్‌ ద్వారా క్రౌడ్‌ ఫండింగ్‌ కూడా చేసుకోవచ్చట.

మరింత సమాచారం తెలుసుకోండి:

ott

సంబంధిత వార్తలు: