రేవంత్‌రెడ్డి.. కుల వృత్తులకు కొత్త ఊపు తెస్తారా?

Chakravarthi Kalyan
కులవృత్తులకు అధునాతన సాంకేతికతను జోడించి బీసీ కులాల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అంటున్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ సిఖ్ విలేజ్ మడ్ ఫోర్డ్ దోభి ఘాట్ లో మోడ్రన్ మెకనైజ్డ్ లాండ్రీ యూనిట్  రవాణా, బిసి సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. దోబీ ఘాట్ లోని చాకలి ఐలమ్మ విగ్రహానికి మంత్రి పొన్నం ప్రభాకర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఐదువందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు.
కులవృత్తులు మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా మారాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ఎమ్మెల్యే, ఎంపితో పాటు ప్రభుత్వ నిధులతో మోడ్రన్ మెకనైజ్డ్ లాండ్రీ యూనిట్ లను నియోజకవర్గానికి ఒకటి చొప్పున ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. తెలంగాణలో కులవృత్తులను ప్రోత్సహించి ఉపాధి అవకాశాలను కల్పించి అధునాతన సాంకేతిక విధానాలతో ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు  కృషి చేస్తున్నట్టు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: