రేవంత్‌ సర్కారు కూలేదప్పుడే.. తేల్చేసిన కేసీఆర్‌?

Chakravarthi Kalyan
ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ నేతలతో సమావేశమవుతున్న కేసీఆర్‌.. కాంగ్రెస్ పాలనపై ఆసక్తికరమైన కామెంట్లు చేశారు. కాంగ్రెస్ సర్కారు త్వరలోనే కూలిపోతుందని ఇటీవల బీఆర్ఎస్ నేతలు తరచు అంటున్నారు. అయితే.. కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలనపై అవగాహన రావడం లేదన్న కేసీఆర్‌.. సర్కార్ తీరుపై ప్రజల్లో విసుగు ప్రారంభమైందంటున్నారు. కాంగ్రెస్ నేతలు వాళ్ళలో వాళ్లే కొట్టుకుంటారని... కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతి, ఆరోపణలు ప్రారంభమయ్యాయని కేసీఆర్‌ పేర్కొన్నారు. అంశాల కోసం మనం వెతుక్కోవాల్సిన అవసరం లేదన్న కేసీఆర్... ప్రభుత్వమే మనకు ఎజెండా ఇస్తుందన్నారు.
ప్రభుత్వానికి ప్రతిపక్ష రుచి చూపుదామని కేసీఆర్‌ అన్నారు. ఏడాది, రెండో ఏడాది, ఐదేళ్లు ఎన్నికలు ఎపుడు వచ్చినా పూర్తి సిద్దంగా ఉండాలన్న కేసీఆర్‌.. రాబోయే కాలం తమదేనని ధీమా వ్యక్తం చేశారు. ఖమ్మంలో అద్భుతమైన అభివృద్ధి చేశామన్న కేసీఆర్‌.. కరీంనగర్ తర్వాత ఖమ్మంలో కూడా సభ పెట్టుకుందామన్నారు. నేతలు కలిసికట్టుగా పనిచేసి పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలని.. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి ముగ్గురితో సమన్వయ కమిటీ ఏర్పాటు చేసుకోవాలని కేసీఆర్ సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: