జగన్‌కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన హైకోర్టు?

Chakravarthi Kalyan
ఏపీ సీఎం జగన్‌కు హైకోర్టు దిమ్మతిరిగే షాక్‌ ఇచ్చింది. రాజధాని భూముల విషయంలో రైతులకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. భూ సేకరణ ప్రక్రియ లో సేకరించిన భూముల్లో ఇచ్చిన ప్లాట్స్ ను రద్దు చేస్తూ ఇచ్చిన ప్రొసీడింగ్స్ ను హైకోర్టు కొట్టి వేసింది. రైతులకు ఇచ్చిన ప్లాట్స్ ను రద్దు చేస్తూ ఇచ్చిన నోటీసులను కూడా కొట్టేసిన హైకోర్ట్.. కమిషనర్, డిప్యూటీ తహశీల్దార్ ఇచ్చిన నోటీస్ లు చెల్లవని స్పష్టం చేసింది.

ప్లాట్లను రద్దు చేస్తూ తమకు ఇచ్చిన నోటీసులు ను హైకోర్ట్ లో రైతులు సవాల్ చేయగా.. రైతుల తరపున న్యాయవాదులు కారుమంచి ఇంద్రనీల్ బాబు, ఆదినారాయణ రావు వాదనలు వినిపించారు. వీరి వాదనలను పరిగణలోకి తీసుకుంది. మొత్తం 862 ప్లాట్లు రద్దు చేస్తూ CRDA నోటీస్ లు ఇవ్వగా.. ఈ నిర్ణయం CRDA చట్టం,మాస్టర్ ప్లాన్ కు విరుద్ధమని ఈ న్యాయవాదుల వాదనలు వినిపించారు. అయితే చట్టంలో మార్పులు తెచ్చామని ప్రభుత్వ న్యాయవాది వివరించినా.. ఇరుపక్షాల వాదనలు అనంతరం రద్దు నిర్ణయాన్ని హైకోర్టు ధర్మాసనం  కొట్టివేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: