ఇవాళ్టి నుంచి రెండు రోజులు షర్మిల సెలక్షన్స్‌?

Chakravarthi Kalyan
ఇవాళ్టి నుంచి రెండు రోజుల పాటు విజయవాడలో ఏపీసీసీ చీఫ్ షర్మిల ఉండనున్నారు. అసెంబ్లీ, పార్లమెంటు కు పోటీ చేసే ఆశావహ అభ్యర్దులతో వైఎస్‌ షర్మిల ముఖాముఖి నిర్వహించనున్నారు. ఈ మధ్యాయాహ్నం నుంచి నరసాపురం, ఏలూరు, నరసరావుపేట, బాపట్ల, గుంటూరు, మచిలీపట్నం, విజయవాడ ఎంపి, ఎమ్మెల్యే కి పోటి చేసే ఆశావహుల అభ్యర్ధులతో వైఎస్‌ షర్మిల ముఖాముఖి నిర్వహిస్తారు.

రేపు శ్రీకాకుళం, అరకు, ఒంగోలు, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, అమలాపురం, రాజమండ్రి పార్లమెంటు, అసెంబ్లీ కి పోటీ చేసే ఆశావహుల అభ్యర్థులతో వైఎస్‌ షర్మిల ముఖాముఖి నిర్వహించనున్నారు. ముఖాముఖిలో నేరుగా ఆభ్యర్ధులతో మాట్లాడనున్న షర్మిల వారిని ఎంపిక చేయనున్నారు. అలాగే మార్చి 1 న తిరుపతిలో కాంగ్రెస్ బహిరంగ సభ నిర్ణయించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ సభకు ముఖ్య అతిధిగా రాజస్థాన్‌ కాంగ్రెస్ నేత సచిన్ పైలెట్ హాజరుకానున్నారు. మొత్తానికి ఏపీలో కాంగ్రెస్‌ పార్టీ పేరు కూడా ఎన్నికల్లో వినిపిస్తోందంటే అందుకు వైఎస్‌ షర్మిలే కారణంగా చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: