ఇవాళ బాబు-పవన్‌ ఫస్ట్ పెర్‌ఫార్మెన్స్‌.. ఎలా ఉంటుందో?

Chakravarthi Kalyan
ఎన్నికల యుద్ధానికి సిద్ధం అంటూ ఇవాళ చంద్రబాబు- పవన్‌ కల్యాణ్‌ ఉమ్మడిగా సమరశంఖం పూరించనున్నారు. తెలుగుదేశం -జనసేన తొలి సభను ఇవాళ నిర్వహించున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం వేదికగా జెండా పేరుతో తొలి ఉమ్మడి భారీ బహిరంగసభ నిర్వహించబోతున్నారు. ఎత్తర జెండా, గెలుపు ఎజండా నినాదంతో ఉమ్మడిగా రెండు పార్టీలు బహిరంగ సభ నిర్వహిస్తున్నాయి.
 
ఇరు పార్టీల శ్రేణులు కలిసి కదనరంగంలోకి దూకేలా చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ దిశానిర్దేశం చేయనున్నారు. 99 మంది  అభ్యర్ధులను ప్రకటించాక ఎన్నికల ప్రచారం కోసం నిర్వహిస్తున్న తొలి ఉమ్మడి సభ ఇదే కావడం విశేషం. పెద్ద ఎత్తున ఇరు పార్టీల శ్రేణులు తరలి వస్తారని భావిస్తున్నారు. తాడేపల్లిగూడెం బైపాస్‌లో తణుకు వెళ్లే మార్గంలో జాతీయ రహదారిని అనుకుని దాదాపు 26 ఎకరాల విశాల మైదానంలో ఈ సభ ఏర్పాటు చేశారు. వేదికపైనే దాదాపు 500 మంది ఆశీనులయ్యేలా ఏర్పాట్లు చేశారు. లక్షల మంది హాజరయ్యేలా, సభా వేదిక ఏర్పాట్లు ఉన్నాయి. కూర్చుని సభ తిలకేంచేందుకు వీలుగా  భారీ స్క్రీన్లు సభా ప్రాంగణం అంతటా ఏర్పాట్లు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: