తెలంగాణ: బీజేపీకి పది, బీఆర్‌ఎస్‌కు ఏడు?

Chakravarthi Kalyan
తెలంగాణలో ఎంపీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌, బీజేపీ పొత్తు పెట్టుకుంటున్నాయని ప్రచారం జరుగుతోంది. అయితే.. దీన్ని మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు తప్పుబట్టారు. బీజేపీని బద్నం చేయడానికి కొందరు కుట్రలు పన్నుతున్నారన్న మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు.. బీఆర్‌ఎస్‌తో పొత్తు ఉండదని బీజేపీ రాష్ట్ర, కేంద్ర నాయకత్వం క్లియర్ గా చెప్పిందన్నారు. బీజేపీ 10, బీఆర్ఎస్‌ 7స్థానాల్లో పోటీ చేస్తుందని కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తోందని మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు విమర్శించారు.

బీఆర్‌ఎస్‌ను బీజేపీనే ఎదుర్కొంటుంది అని మూడు సార్లు తెలంగాణ ప్రజలు తీర్పు ఇచ్చారని.. బీఆర్‌ఎస్‌ పార్టీ పని అయిపోయిందని మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్  ఇండియా కూటమిలో ఉన్నారని.. కేజ్రీవాల్ హైదరాబాద్ వస్తే కేసీఆర్ ఇంటికి వెళ్తారు...వీళ్లిద్దరూ ఒక్కటేనని మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. ఢిల్లీలో లిక్కర్ దుకాణం పెట్టి కొత్త దందా మొదలు పెట్టారు..ఢిల్లీ డిప్యూటీ సీఎం జైల్లో ఉన్నారని.. ఇక్కడ ఉన్న తెలంగాణ చెల్లె బతుకమ్మ పైసలు సరిపోతలేవు అని కొత్త దందా మొదలుపెట్టిందని మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు విమర్శించారు. కాంగ్రెస్, భారాసా పార్టీలు బొమ్మ బొరుసు లాంటివన్న రఘునందన్ రావు.. బీజేపీ కార్యకర్తలు తప్పుడు వార్తలు నమ్మకండన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp

సంబంధిత వార్తలు: