గుడ్‌న్యూస్.. లాభాల్లోకి వచ్చిన ఆర్టీసీ?

Chakravarthi Kalyan
ఇన్నాళ్లూ నష్టాల్లో ఉన్న ఆర్టీసి ఇప్పుడు మహాలక్ష్మి పథకం పుణ్యమా అని లాభాల్లోకి వచ్చింది. ఈ విషయాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. మహాలక్ష్మి పధకం వ్యయం ప్రభుత్వం రిఫండ్ చెయ్యడంతో పాటు వృధా ఖర్చులు తగ్గించడం, ఆక్యుపెన్సీ రేషియో పెరగడం
వల్ల ఆర్టీసీ లాభాల్లోకి వచ్చిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.

మహిళల ఆర్టీసీ ఉచిత ప్రయాణంతో ఆటోవాళ్లకు ఇబ్బంది లేదన్న మంత్రి పొన్నం ప్రభాకర్.. ఆటోవాళ్ళకి మేము ఇస్తామన్న విధంగా ఏడాదికి 12వేలు చెల్లిస్తామని ప్రకటించారు. ఆ పధకం అమలుకు కసరత్తు చేస్తున్నామన్న మంత్రి పొన్నం ప్రభాకర్.. వాస్తవ లబ్దిదారుల అందరికి  లబ్ది చేకూరేట్లు  చూస్తామన్నారు. హైదరాబాద్ నగరంలో కొత్త ఆటోలకు అనుమతులు ఇవ్వడం లేదన్న మంత్రి పొన్నం ప్రభాకర్.. కొత్తవాటికి అనుమతి ఇస్తే ఇప్పటికే ఉన్న ఆటోవాలాలకు ఇబ్బంది ఉంటుందని ఇవ్వడం లేదన్నారు. బీ సి జనగణన ప్రారంభించేందుకు కసరత్తు జరుగుతోందన్న మంత్రి పొన్నం ప్రభాకర్.. బీహార్ లో 2.50 లక్షల మందికి ఒకొక్కరికి 150 ఇల్లు కేటాయించి సర్వే చేయించారన్నారు. దానిని పరిశీలన చేస్తున్నాం...మరింత పగడ్బందీగా సర్వే చేస్తామన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: