ఈ బ్రాండ్లతో నకిలీ వస్తువులు.. ఆరోగ్యాలు జాగ్రత్త?

Chakravarthi Kalyan
హైదరాబాద్‌ కాచిగూడలో నిత్యావసరం నకిలీ వస్తువులను తయారు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. రెడ్ లేబుల్, బ్రూక్ బాండ్శటీ పౌడర్స్, హార్పిక్, లైజాల్, ఎవరెస్ట్ మసాలా, పారచుట్ హెయిర్ ఆయిల్, సర్ఫ్ ఎక్సెల్ ని తయారు చేసి మార్కెట్లో విక్రయిస్తున్న ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. కాటేదాన్,నాగారం ప్రాంతాల్లో వీరు తయారీ కేంద్రాలను ఏర్పాటు చేసుకున్నారు. దాదాపు 2 కోట్ల విలువైన నకిలీ వస్తువులను పోలీసులు సీజ్ చేశారు.

నలుగురి నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరిలించారు. ఈ కేసులో మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. నిందితులు బీహార్, రాజస్థాన్ కి రాష్ట్రానికి చెందిన వ్యక్తులుగా గుర్తించారు. నిందితులు నకిలీ వస్తువులను నగరంలో వివిధ కిరాణా దుకాణాలకు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. మార్కెట్ల ధర కంటే  తక్కువ ధరకే డిస్ట్రిబ్యూటర్స్ కి నకిలీ వస్తులను విక్రయిస్తున్నారు. ఈ నకిలీ నిత్యావసర వస్తువులను వాడటం వల్లన ప్రజలు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. హైదరాబాద్ నగరవ్యాప్తంగా నకిలీ వస్తువులను విక్రయాలు జరుపుతున్నట్టు తెలిసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: