రేపు తెలంగాణ ప్రాజెక్టులకు మోదీ శ్రీకారం?

Chakravarthi Kalyan
తెలంగాణ రాష్ట్రంలో పలు రైల్వే అభివృద్ధి పనులకు రేపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. సోమవారం దేశవ్యాప్తంగా నరేంద్ర మోదీ 500 కు పైగా అమృత్ భారత్ స్టేషన్లు, దాదాపు 1,500 రైల్ ఫ్లై ఓవర్లు/అండర్ పాస్ లకు భూమిపూజ/జాతికి అంకితం చేయనున్నారు. తెలంగాణలో రూ. 230 కోట్లకు పైగా నిధులతో చేపట్టనున్న 15 అమృత్ భారత్ స్టేషన్లు, రూ. 169 కోట్లకు పైగా నిధులతో నిర్మించనున్న 17 రైల్ ఫ్లైఓవర్/అండర్ పాస్ లకు శ్రీకారం చుట్టనున్నారు. 

రూ. 221.18 కోట్లతో పూర్తి చేసిన మరో 32 రైల్ ఫ్లై ఓవర్/రైల్ అండర్ పాస్ లను ప్రధాని మోదీ జాతికి అంకితం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణకు సంబంధించిన ప్రాజెక్టుల మొత్తం విలువ దాదాపు రూ. 621 కోట్లు. తెలంగాణలోని మొత్తం 40 అమృత్ భారత్ స్టేషన్ల పునరాభివృద్ధికి ఖర్చు చేస్తున్న మొత్తం రూ. 2,245 కోట్లు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: