రేవంత్ సర్కారు మరో అద్భుత నిర్ణయం?

Chakravarthi Kalyan
తెలంగాణ వ్యాప్తంగా రూ. 2 వేల 500 కోట్ల రూపాయలతో 100 రెసిడెన్షియల్ పాఠశాలలు నిర్మించబోతున్నారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఎస్సీ, బీసీ, మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలు వేర్వేరుగా కాకుండా... ఒకే చోట నిర్మించనున్నట్లు భట్టి విక్రమార్క తెలిపారు. పైలట్ ప్రాజెక్టును తాను ప్రాతినిథ్యం వహిస్తున్న మధిర నియోజకవర్గంలో చేపట్టనున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు.
మధిర నియోజకవర్గంలోని చింతకాని మండల కేంద్రంలో ఇండోర్ స్టేడియం సమీపంలోని 10 ఎకరాల్లో ఎస్సీ, బీసీ, మైనారిటీ బాలుర రెసిడెన్షియల్ పాఠశాల నిర్మిస్తారు. ఎర్రుపాలెం మండలంలో ఎస్సీ, బీసీ, మైనారిటీ బాలికల సమీకృత రెసిడెన్షియల్ స్కూల్ నిర్మిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల భవన సముదాయాల కోసం స్థలాలు గుర్తించాలని అధికారులను భట్టి విక్రమార్క ఆదేశించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: