హైదరాబాద్‌ సమీపంలో మరో అద్భుత దేవాలయం?

Chakravarthi Kalyan
తెలంగాణ వాసులకు, ప్రత్యేకించి హైదరాబాద్ వాసులకు మరో అద్భుతమైన శిల్పకళతో రూపుదిద్దుకున్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులకు అందుబాటులోకి రానుంది. మానేపల్లి కుటుంబం, మానేపల్లి చారిటబుల్‌ ట్రస్టు ఆధ్వర్యంలో భువనగిరిలోని మానేపల్లి హిల్స్‌లో స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి పేరుతో ఆలయ నిర్మాణం పూర్తి చేసింది. మార్చి 1తేదీ ప్రజలకు అందుబాటులోకి రానుంది.

22 ఎకరాల్లో నిర్మితమైన ఈ ఆలయ ప్రారంభోత్సవ వేడుకలను మార్చి 1 నుంచి 6 తేదీ వరకు నిర్వహిస్తున్నారు. మార్చి 6 తేదీ ఉదయం 11.06 నిమిషాలకు త్రిదండ చిన శ్రీమన్నారాయణ రామానునజ జీయర్‌స్వామి చేతులు మీదుగా ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది.  పల్లవ, విజయనగర, చోళ, చాళుక్య శిల్ప రీతులతో ఆలయ నిర్మాణం చేసినట్లు శిల్పి డీఎన్‌వీ ప్రసాద్‌ తెలిపారు. ప్రారంభోత్సవ వేడుకల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన  కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: