సంచలనం: రేవంత్‌ సర్కారుపై కరెంటు కుట్రలు?

Chakravarthi Kalyan
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కరెంట్‌ సరఫరా బాగా ఉండదని బీఆర్ఎస్‌ ఎన్నికల సమయంలో ప్రచారం చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కొన్ని చోట్ల కరెంటు పోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే.. కొందరు అధికారులు కావాలనే రేవంత్ సర్కారుపై దుష్ప్రచారం కోసం కరంట్ కట్ చేస్తున్నారా అన్న అనుమానాలు వస్తున్నాయి. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయం చెప్పారుయ
విద్యుత్తుపై దుష్ప్రచారం చేస్తూ ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేందుకు  కొందరు కుట్రలు చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి అధికారుల సమీక్షలో అన్నారు. అలాంటి అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం హెచ్చరించారు. గ‌త ప్రభుత్వ హ‌యాంలో నియ‌మితులైన కొంద‌రు క్షేత్రస్థాయి సిబ్బంది ఉద్దేశపూర్వకంగా విద్యుత్ కట్ చేస్తున్నారన్న సమచారం తమకు ఉందని సీఎం రేవంత్ తెలిపారు.  గ‌తంతో పోల్చితే విద్యుత్ స‌ర‌ఫ‌రా పెంచినప్పటికీ.. కోత‌లు విధిస్తున్నారని చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టాల్సిన బాధ్యత విద్యుత్తు అధికారులదేనని రేవంత్ రెడ్డి తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: