తెలంగాణను ఎండబెట్టేలా కర్ణాటక ప్రాజెక్టు కడుతోందా?

Chakravarthi Kalyan
రాయచూర్ జిల్లా చిక్కమంచిలి గ్రామం వద్ద తుంగభద్రపై కర్నాటక ప్రభుత్వం మరో ఆనకట్ట నిర్మాణానికి సిద్దమైందని బీఆర్‌ఎస్‌ నేతలు అంటున్నారు. అదే జరిగితే ఉమ్మడి పాలమూరు జిల్లా ఎడారి అయ్యే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. కర్ణాటక ప్రాజెక్టులు కడుతుంటే రాష్ట్ర, పాలమూరు జిల్లా ప్రయోజనాలు రేవంత్ రెడ్డికి పట్టవా..కళ్ళు మూసుకొని కూసుంటారా అని ప్రశ్నిస్తున్నారు. నల్లమల్ల బిడ్డ అనే రేవంత్ రెడ్డి ఈ అంశంపై దృష్టి సారించాలని.. కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని, వెంటనే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
కర్నాటకను ఇప్పుడు నిలువరించకపోతే కాంగ్రెస్ వైఫల్యం అవుతుందని, ప్రజలు గుణపాటం చెబుతారని వారు హెచ్చరించారు. కాల్వల పనులు పూర్తి చేస్తే పనులు త్వరగా కావడంతో పాటు లక్షన్నర ఎకరాలకు నీరు వస్తుందంటున్న నేతలు.. పాలమూరు - రంగారెడ్డి పనులను పడబెట్టి పది లక్షల ఎకరాలకు నీరు రాకుండా చూస్తారేమోనని ఆందోళన నెలకొందన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: