మేడారం వెళ్తున్నారా.. ఏర్పాట్లు ఇవే?

Chakravarthi Kalyan
ఇవాళ్టి నుంచి ప్రారంభమైన మేడారం జాతరకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఆర్టీసీ 6వేల బస్సులను పెద్ద ఎత్తున కేటాయించింది. రైల్వేశాఖ కూడా ప్రత్యేక సర్వీసులు నడుపుతోంది. పర్యాటకశాఖ హెలికాప్టర్ సౌలభ్యం కల్పిస్తోంది. మేడారం జాతరకు అన్ని ఏర్పాట్లు చేసిన రాష్ట్రప్రభుత్వం.. తాత్కాలిక ఏర్పాట్లతో పాటు ఈ ఏడాది శాశ్వత ఏర్పాట్లు కూడా చేసింది.
త్రాగునీరు, మరుగుదొడ్లు, అదనపు స్నాన ఘట్టాలు ఏర్పాటు చేశారు. బ్యాటరీ ట్యాప్స్, అంతర్గత రోడ్లు, వైద్యశిబిరాలు, పారిశుద్ధ్యం, నిరంతర విద్యుత్, పార్కింగ్‌ సదుపాయాలు ఏర్పాటు చేసారు. మేడారం జాతర మొత్తంలో 300 ఎల్‌ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. జాతర, భద్రతా పర్యవేక్షణకు 300 సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలు ఏర్పాటు చేశారు. సెంట్రల్ కంట్రోల్ రూమ్ ద్వారా నిరంతరం అధికారులు పర్యవేక్షిస్తున్నారు. 500 ప్రాంతాల్లో 8400 తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేసింది. మేడారం జాతర విధుల్లో 16 వేల మంది ఉద్యోగులు ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: