రేవంత్‌ విన్నపాలు.. గడ్కరీ తీరుస్తారా?

Chakravarthi Kalyan
దిల్లీలో కేంద్ర మంత్రి గడ్కరీని కలిసిన సీఎం రేవంత్ రెడ్డి ఆయన ముందు పలు విజ్ఞప్తులు ఉంచారు. హైద‌రాబాద్ నుంచి విజ‌య‌వాడ జాతీయ ర‌హ‌దారిని ఆరు వ‌రుస‌ల ర‌హ‌దారిగా, హైద‌రాబాద్ నుంచి క‌ల్వకుర్తి వ‌ర‌కు ఉన్న ర‌హ‌దారిని నాలుగు వ‌రుస‌లుగా విస్తరించాల‌ని కేంద్ర మంత్రికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. అయితే ముఖ్యమంత్రి విజ్ఞప్తుల‌కు కేంద్ర మంత్రి నితిన్ గ‌డ్కరీ సానుకూలంగా స్పందించినట్టు సీఎంఓ తెలుపుతోంది.
సీఆర్ ఐఎఫ్ నిధుల మంజూరుకు అవ‌స‌ర‌మైన ప్రతిపాద‌న‌లు పంపాల‌ని కేంద్ర మంత్రి ఈ సంద‌ర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి సూచించినట్టు తెలుస్తోంది.  జాతీయ ర‌హ‌దారులుగా అప్‌గ్రేడ్ చేయాల‌ని ముఖ్యమంత్రి కోరిన ర‌హ‌దారుల జాబితా ఇదీ..
1.మ‌రిక‌ల్‌-నారాయ‌ణపేట్‌-రామ‌స‌ముద్ర-63 కి.మీ.
2.పెద్ద‌ప‌ల్లి-కాటారం-66 కి.మీ
3.పుల్లూర్‌-అలంపూర్‌-జ‌ట‌ప్రోలు-పెంట్ల‌వెల్లి-కొల్లాపూర్‌-లింగాల్‌-అచ్చంపేట-డిండి-దేవ‌ర‌కొండ‌-మ‌ల్లేప‌ల్లి-న‌ల్గొండ‌-225 కి.మీ.
4.వ‌న‌ప‌ర్తి-కొత్త‌కోట‌-గ‌ద్వాల‌-మంత్రాల‌యం-110 కి.మీ.
5.మ‌న్నెగూడ‌-వికారాబాద్‌-తాండూర్‌-జ‌హీరాబాద్‌-బీద‌ర్‌-134 కి.మీ.
6.క‌రీంన‌గ‌ర్‌-సిరిసిల్ల‌-కామారెడ్డి-ఎల్లారెడ్డి-పిట్లం-165 కి.మీ.
7.ఎర్ర‌వెల్లి క్రాస్ రోడ్‌-గ‌ద్వాల‌-రాయ‌చూర్‌-67 కి.మీ.
8.జ‌గిత్యాల‌-పెద్ద‌ప‌ల్లి-కాల్వ శ్రీ‌రాంపూర్‌-కిష్టంపేట‌-క‌ల్వ‌ప‌ల్లి-మోరంచ‌ప‌ల్లి-రామ‌ప్ప దేవాల‌యం-జంగాల‌ప‌ల్లి-164 కి.మీ
9.సార‌పాక‌-ఏటూరునాగారం-93 కి.మీ
10.దుద్దెడ‌-కొమురవెల్లి-యాద‌గిరిగుట్ట‌-రాయ‌గిరి క్రాస్‌రోడ్‌-63 కి.మీ.
11.జ‌గ్గ‌య్య‌పేట‌-వైరా-కొత్త‌గూడెం-100 కి.మీ.
12.సిరిసిల్ల‌-వేముల‌వాడ‌-కోరుట్ల‌-65 కి.మీ
13.భూత్పూర్‌-నాగ‌ర్‌క‌ర్నూల్‌-మ‌న్న‌నూర్‌-మ‌ద్దిమ‌డుగు (తెలంగాణ‌)-గంగ‌ల‌కుంట‌-సిరిగిరిపాడు-166 కి.మీ.
14.క‌రీంన‌గ‌ర్‌-రాయ‌ప‌ట్నం-60 కి.మీ

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: