విరాట్‌, అనుష్క జంటకు మళ్లీ బిడ్డ.. పాపా..బాబా?

Chakravarthi Kalyan
విరాట్‌ కోహ్లీ, అనుష్క శర్మ దంపతులు మళ్లీ తల్లిదండ్రులయ్యారు. ఫిబ్రవరి 15న అనుష్క శర్మ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని విరాట్‌ కోహ్లీ సామాజిక మాధ్యమాల వేదికగా ఆనందంగా ప్రకటించారు. అంతేకాదు.. ఆ మగబిడ్డకు ‘అకాయ్‌’ అని పేరు పెట్టినట్టు విరాట్‌ కోహ్లీ తెలిపారు. తాము ఫిబ్రవరి 15న తమ కుమారుడు అకాయ్‌ అంటే వామిక తమ్ముడిని ఈ లోకంలోకి స్వాగతించామని ఆ పోస్టులో తెలిపారు. తమ జీవితంలోని ఈ మధురమైన క్షణాల్లో మీ ఆశీర్వాదాలు, శుభాకాంక్షలు కోరుకుంటున్నామని.. మా గోప్యతను గౌరవించండని విరాట్‌ తన పోస్టులో పేర్కొన్నాడు.
విరాట్, అనుష్క జంటకు మొదటి సంతానం ఓ పాప.. ఆ పాప పేరు వామిక. ఇప్పటికే ఓ పాప ఉండటంతో ఇప్పుడు బాబు పుట్టడంతో ఆ జంట ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆ జంటకు చెందిన ఫ్యాన్స్ కూడా ఈ న్యూస్‌ తెలిసి హ్యాపీగా ఫీలవుతున్నారు. విరాట్-అనుష్క జంటకు సోషల్ మీడియాలోశుభాకాంక్షలు తెలుపుతూ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: