జగన్‌కు మంద కృష్ణ మాదిగ వార్నింగ్‌?

Chakravarthi Kalyan
ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ మరోసారి ఉద్యమం రూపొందిస్తున్నారు. ఈసారి ఉద్యమాన్ని ఏపీలో ప్రారంభిస్తున్నారు. దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి మార్చి 9న చలో అమరావతి కార్యక్రమం చేపడుతున్నట్లు
ఎమ్మార్పీఎస్ నేత మంద కృష్ణ మాదిగ మీడియాకు తెలిపారు. వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్వంలో గుంటూరులో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో మంద కృష్ణ మాదిగ పాల్గొన్నారు.
దివ్యాంగులు తమ సమస్యలు, హక్కుల కోసం రోడ్డెక్కకముందే సీఎం జగన్ స్పందించాలని మంద కృష్ణ మాదిగ సూచించారు. లేనిపక్షంలో ఆ తరువాత జరిగే ఆందోళనలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని మంద కృష్ణ మాదిగ హెచ్చరించారు. దివ్యాంగులు ఫించన్ 6 వేల రూపాయలకు పెంచడమే కాకుండా వివాహ కానుకకు విధించిన పదోతరగతి అర్హత నిబంధనను తొలగించాలని మంద కృష్ణ మాదిగ డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ డిమాండ్‌పై జగన్ సర్కారు ఎలా స్పందిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: