ఎంపీగా గెలిపిస్తే.. బంపర్ ఆఫర్‌ ఇచ్చిన కేఏ పాల్‌?

Chakravarthi Kalyan
విశాఖ ఎంపీగా తనను గెలిపిస్తే స్టీల్‌ ఫ్యాక్టరీని కాపాడటానికి పార్లమెంటును సైతం స్తంభింప చేస్తానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు డాక్టర్ కే ఏ పాల్ అంటున్నారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని అదానీకే ఎందుకు అమ్ముతున్నారని కే ఏ పాల్ ప్రశ్నించారు. ప్రజాశాంతి పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే రాష్ట్ర అభివృద్ధి చేస్తానన్న కే ఏ పాల్.. ఏపీ రాష్ట్రానికి ఉన్న లక్షల కోట్ల అప్పులను తీరుస్తానని కే ఏ పాల్ అన్నారు.

విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడేందుకు కోర్టులో తను వేసిన కేసు చల్లదంటూ జడ్జి ఉత్తర్వులు ఇవ్వడం పై మండిపడ్డారు. రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు మోడీకి తొత్తులుగా మారాయన్నారు. అటువంటి పార్టీలకు ప్రజలు ఎందుకు మద్దతిస్తున్నారని ప్రశ్నించారు. తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం తాను పోరాడుతున్నారని రాబోయే ఎన్నికల్లో విశాఖ ఎంపీగా తనని గెలిపించాలని కే ఏ పాల్ కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: