గ్రూప్‌ వన్‌పై కోర్టుకు వెళ్లే యోచనలో అభ్యర్థులు?

Chakravarthi Kalyan
గ్రూప్‌ వన్‌లో ఈడబ్ల్యూఎస్ కోటా పోస్టులను హారిజాంటల్ విధానంలో భర్తీ చేయాలన్న డిమాండ్లు వస్తున్నాయి. ఈ డబ్ల్యూ ఎస్ రిజర్వేషన్ హారిజంటల్ గా వర్తింపజేస్తే బీసీ, ఎస్సీ,ఎస్టీ వర్గాలకు మరియు ఈ డబ్ల్యూ ఎస్ వర్తించని ఓసి క్యాండిడేట్స్ కు కూడా చాలా లాభం చేకూరుతుందని కొందరు అభ్యర్థులు వాదిస్తున్నారు. దీనిపై ఒక పిటిషన్ వేస్తే ప్రిలిమ్స్ అయ్యేలోగా ఏదో ఒక పరిష్కారము లభిస్తుందని ఆలోచిస్తున్నారు.
కేవలం కోర్టు ద్వారా వచ్చిన డైరెక్షన్ ను మాత్రమే ప్రభుత్వాలు పాటిస్తున్నాయి అనే విషయాన్ని అర్థం చేసుకోవాల్సి ఉందంటున్న అభ్యర్థులు.. బెస్ట్ ఎగ్జాంపుల్ హారిజంటల్ రిజర్వేషన్ గురించి కోర్టులో మనం ఫైట్ చేసినందుకు మనకు అనుకూలంగా ప్రభుత్వము కూడా స్పందించిందని చెబుతున్నారు. కోర్టు డైరెక్షన్ ఇస్తే తప్పక ప్రభుత్వాలు అమలు చేయవలసి వస్తుంది. కాబట్టి ఈ కోణంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవలని సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: