6 పెట్టెల జయలలిత నగలు.. దక్కేది వారికే?

Chakravarthi Kalyan
జయలలిత అక్రమంగా సంపాదించిన బంగారు, వజ్రాభరణాలను తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని కర్ణాటకలోని బెంగళూరు కోర్టు తీర్పు చెప్పింది. మార్చి 6,7 తేదీల్లో ఆ ఆభరణాలను తీసుకోవాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇందు కోసం 6 ట్రంకు పెట్టెలతో రావాలని బెంగళూరు కోర్టు తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ బంగారు ఆభరణాలను తమిళనాడు హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఐజీపీ ఆ అధికారి వచ్చి తీసుకోవాలని బెంగళూరు కోర్టు సూచించింది.

అయితే.. ఫొటోగ్రాఫర్స్, వీడియో గ్రాఫర్స్, ఆరు పెద్ద ట్రంకు పెట్టెలు, అవసరమై భద్రత సిబ్బందితో వచ్చి బంగారు ఆభరణాలను తీసుకోవాలని బెంగళూరు కోర్టు ఆదేశించింది. తమిళనాడు డిప్యూటీ ఎస్పీ ఈ విషయాన్ని హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దృష్టికి తీసుకెళ్లాలని.. ఆ రోజుల్లో భద్రతకు స్థానిక పోలీసులను ఏర్పాటు చేసుకోవాలని బెంగళూరు కోర్టు ఆదేశించింది.  అయితే ఈ కేసు విచారణ కోసం కర్ణాటక ప్రభుత్వం చేసిన రూ.5కోట్లు ఖర్చును తమిళనాడు ప్రభుత్వం చెల్లించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: