చంద్రబాబు సవాల్.. వైసీపీలో గందరగోళం?

Chakravarthi Kalyan
జగన్ హయాంలో చేసిన అభివృద్ధిపై చర్చకు సిద్దం అని ఇటీవల చంద్రబాబు సవాల్ విసిరారు. అయితే.. అయితే దీనిపై వైసీపీ నేతలు తలా ఒకరకంగా స్పందిస్తున్నారు. మరో 50 రోజుల్లో ఏకంగా ఎన్నికలే వస్తుంటే.. మళ్లీ ఈ సవాల్లేంటని.. ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటామని వైసీపీ అగ్రనేత సజ్జల రామకృష్ణారెడ్డి కామెంట్ చేశారు. అయితే.. రాష్ట్రంలో నిజమైన అభివృద్ది జగన్ హయాంలోనే జరిగింద‌ని, అభివృద్ధిపై చంద్రబాబు చ‌ర్చకు వ‌చ్చినా మేం రెడీగా ఉన్నామ‌ని వైసీపీ విజ‌య‌వాడు తూర్పు నియోక‌వ‌ర్గ స‌మ‌న్వయ‌క‌ర్త దేవినేని అవినాష్ అంటున్నారు.
ఒక్క విజ‌య‌వాడ తూర్పు నియోజకర్గంలోనే రూ.650 కోట్ల విలువైన అభివృద్ది జరిగింద‌ని వైసీపీ నేతల అవినాష్ చెబుతున్నారు. కొండ ప్రాంతాలు కరకట్ట ప్రాంతం ఎంతో అభివృద్ది చేశామ‌ని అవినాష్ తెలిపారు. రిటైనింగ్ వాల్ నిర్మాణం చేసి ప్రజలకు అండగా నిలిచామ‌ని.. టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఏ అభివృద్ధీ చేయలేదని అవినాష్ మండిప‌డ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: