భీమిలి తీరాన్ని విజయసాయిరెడ్డి కబ్జా పెట్టేశారా?

Chakravarthi Kalyan
విశాఖలో విజయసాయిరెడ్డి కబ్జాలో భీమిలి సాగర తీరం ఉందని జనసేన విమర్శిస్తోంది. ప్రభుత్వ స్ధలాలు, కొండలు, గుట్టలు అయిపోయాయని ఇక సాగరతీరంలో కబ్జా జరుగుతోందని జనసేన కార్పోరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. విజయసాయి కుటుంబానికి చెందిన అవ్యాన్ రియల్టీ పేరిట భీమిలి సీ ఆర్ జడ్ పరిధిలో అక్రమ కట్టడాలు వెలుస్తున్నాయని జనసేన కార్పోరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు.

ఉత్తరాంధ్ర ఇన్చార్జిగా పలు  సీ ఆర్ జడ్ ఉల్లంఘనలను చేయించిన విజయసాయి రెడ్డి ఇప్పడు తానే స్వయంగా అక్రమాలకు పాల్పడుతున్నారని జనసేన కార్పోరేటర్ పీతల మూర్తి యాదవ్ అంటున్నారు. సీ ఆర్ జడ్ ఉల్లంఘలతో కట్టిన భీమిలి బీచ్ లో ఉన్న ప్రహరీలను కూల్చేయాలని జనసేన కార్పోరేటర్ పీతల మూర్తి యాదవ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు జనసేన కార్పోరేటర్ పీతల మూర్తి యాదవ్ జిల్లా కలెక్టర్, జివిఎంసి కమిషనర్ కి ఫిర్యాదు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: