జగన్‌కు చెంపదెబ్బలాంటి హైకోర్టు తీర్పు?

Chakravarthi Kalyan
జగన్‌ సర్కారు మరో 50 రోజుల్లో ఎన్నికలకు వెళ్లనున్న సమయంలో హైకోర్టు ఓ విషయంలో ఘాటుగా స్పందించింది. గుంటూరునగరంలో డయేరియా మరణాలు జగన్ సర్కారుకు చెడ్డపేరు తెలుస్తున్నాయి. దీనిపై ఏపీ హైకోర్టు సుమోటోగా స్పందించింది. వాస్తవాలను పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఏపీ హైకోర్టు రాష్ట్ర న్యాయాధికార సంస్థకు ఆదేశాలిచ్చింది. హైకోర్టు ఆదేశాలతో జడ్జి లీలావతి జీజీహెచ్‌కు వచ్చారు. చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. వారికి అందుతున్న చికిత్స, అనారోగ్యానికి గల కారణాలను వైద్యులను జడ్జి లీలావతి అడిగి తెలుసుకున్నారు.
ఈ డయేరియా ఘటనపై నివేదికను జడ్జి లీలావతి కోర్టుకు సమర్పించనున్నారు. దాదాపు రెండు వారాలుగా గుంటూరు నగరంలోని పలు ప్రాంతాల ప్రజలను కలుషిత నీటి సమస్య వణికిస్తోంది. కలుషిత నీరు తాగి వాంతులు, విరేచనాలతో పదుల సంఖ్యలో రోగులు ఆస్పత్రుల్లో చేరుతున్నారు. అంతేకాదు.. నలుగురు డయేరియా అనుమానిత లక్షణాలతో మృతి చెందారు కూడా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: