బాలకృష్ణ బినామీలు.. అవినీతి లీలలెన్నో?

Chakravarthi Kalyan
హెచ్‌ ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. శివ బాలకృష్ణ సోదరుడు శివ నవీన్ కాకుండా మరో నలుగురు బినామీలుగా ఉన్నట్లు గుర్తించారు. శివ బాలకృష్ణ ఆదేశాల మేరకు పనిచేసిన అధికారుల వ్యవహరంపై కూడా దృష్ణి సారించారు. త్వరలో హెచ్‌ఎండిఏ డైరెక్టరగా ఉన్న సమయంలో శివబాలకృష్ణ వద్ద పనిచేసిన వారిని సైతం అధికారులు విచారించనున్నారు. శివబాలకృష్ణ బినామీలుగా గుర్తించిన సత్యనారాయణ మూర్తి, పెంటా భరత్ ను రెండు రోజుల పాటు ఏసీబీ ప్రధాన కార్యాలయంలో విచారించారు.  వారిపై శివ బాలకృష్ణ కూడబెట్టిన బినామీ ఆస్తుల వివారాలు సేకరించారు.
దర్యాప్తులో భాగంగా మరో ఇద్దరు బినామీలను ఏసీబీ అధికారులు గుర్తించారు. కస్టడీ విచారణలో అనిశా వద్ద ఉన్న సమాచారానికి మాత్రమే శివ బాలకృష్ణ సమాధానం చెప్పడంతో అని ఆస్తులు వివరాలు తెలుసుకునేందుకు రెవెన్యూ సహా ఇతర శాఖలకు అనిశా లేఖలు రాసింది. విచారణలో శివబాలకృష్ణ చెప్పి ఐఏఎస్ అధికారి వ్యవహరంపై అతన్ని విచారించేందుకు న్యాయ సలహా తీసుకున్న ఏసీబీ నోటీలసులు ఇచ్చి విచారించేందుకు సిద్దంగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: