కేసీఆర్‌ పట్టించుకోలేదు.. కిషన్‌రెడ్డి సంచలన ఆరోపణ?

Chakravarthi Kalyan
గతంలో కేసీఅర్ ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం వల్లే తెలంగాణలో మ్యూజియం ఏర్పాటు ఆలస్యమైందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కేసీఆర్ కు ఎన్ని లేఖలు రాసినా స్పందన లేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. నిజాం, రజాకార్లకు వ్యతిరేకంగా రామ్ జీ గోండు పోరాటం చేశారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కొనియాడారు. గిరిజన సంస్కృతి సంప్రదాయాలు భవిష్యత్ తరాలకు తెలియజేయాల్సి ఉందన్న కిషన్ రెడ్డి.. హైదరాబాద్ లో రామ్ జీ గోండు పేరుతో ట్రైబల్ మ్యూజియం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.

అలాగే మేడారం జాతరకు 3 కోట్ల వరకు కేంద్ర ప్రభుత్వం ఇవ్వనున్నట్లు కిషన్ రెడ్డి చెప్పారు. గిరిజనులకు భూముల హక్కులను కూడా కల్పిస్తున్నామన్న కిషన్ రెడ్డి.. గిరిజనుల సమగ్ర అభివృద్ధి కోసం కృషి చేయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. గిరిజనుల హక్కుల కోసం కొమురం భీం, రామ్ జీ గోండు పోరాటం చేశారని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క కూడా కొనియాడారు. రామ్ జీ గోండు మ్యూజియంకు శంకుస్థాపన చేసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: