కేసీఆర్‌ సర్కార్‌.. గొర్రెల స్కీమ్‌లోనూ స్కాములేనా?

Chakravarthi Kalyan
గొర్రెల పంపిణీ పథకం అమల్లో మోసాలు జరిగినట్లు కాగ్ నివేదిక చెబుతోంది. ఏడు జిల్లాల్లో మచ్చుకు తనిఖీ చేయగా 253.93 కోట్ల మేర సందేహాస్పద లావాదేవీలతో పాటు తీవ్ర లోపాలను గమనించినట్లు కాగ్‌ తెలిపింది. నకిలీ రవాణా ఇన్‌వాయిస్‌లు, నకిలీ వాహనాలు, వాహనాల్లో సామర్థ్యానికి మించి గొర్రెల యూనిట్ల రవాణా, గొర్రెలకు నకిలీ ట్యాగ్‌ల కేటాయింపు, తదితరాలు ఉన్నట్లు కాగ్ తెలిపింది. ఒక్క సంగారెడ్డి జిల్లాలో ఒక మోటార్‌ బైక్‌పై 126 గొర్రెలు రవాణా చేసినట్లు కాగ్ వివరించింది.
నల్గొండ జిల్లాలో ఒక ఆటోలో 126 గొర్రెలు రవాణా చేసినట్లు కాగ్‌ తనిఖీల్లో తేలింది. అంబులెన్స్‌లలోనూ, అగ్నిమాపక వాహనాల్లోనూ., నీళ్ల ట్యాంకర్లలో, మొబైల్‌ కంప్రెసర్‌లలో కూడా గొర్రెలు రవాణా చేసినట్లు చూపారని కాగ్‌ పేర్కొంది. ఒకే వాహనం ఒకే రోజు శ్రీకాకుళం, కడప జిల్లా నుంచి మహబూబ్ నగర్‌ జిల్లాకు గొర్రెలు తరలించినట్లు ఆడిట్ రిపోర్టు తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: