జడ్జిని మేనేజ్‌ చేస్తానని రూ. 7కోట్లు కొట్టేసిన లాయర్‌?

Chakravarthi Kalyan
హైకోర్టు సీనియర్ న్యాయవాది ఒకరిపై సిసిఎస్‌ లో కేసు నమోదైంది. కోర్టులో తనకు అనుకూలంగా తీర్పు వచ్చేలా చేస్తానని చెప్పి ఏడు కోట్లు తీసుకుని హైకోర్టు సీనియర్ న్యాయవాది మోసం చేశాడని చింతల్ కి  చెందిన యాదగిరి అనే వ్యక్తి  ఫిర్యాదు చేశాడు. న్యాయం జరగకపోవడంతో డబ్బులు తిరిగి ఇవ్వమన్నందుకు బెదిరిపులుకు దిగారని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై అతని ఫిర్యాదు మేరకు హైకోర్టు సీనియర్ న్యాయవాదితో పాటు ఓ ఎమ్మెల్యేపై కూడా ఎస్సీ ఎస్టీ సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

రంగారెడ్డి జిల్లా బౌరంపేట గ్రామంలో బుడగజంగాల అసోసియేషన్‌కు చెందిన వంద కుటుంబాలకు సర్వే నెంబర్లు 242, 246, 247,250,251, 252, 268 లో భూమి విషయంలో వివాదం ఉంది. దీనిపై న్యాయపరంగా ముందుకు వెళ్లేందుకు వారు న్యాయవాదిని నియమించుకున్నారు.  ఏడు కోట్లు తీసుకుని హైకోర్టు సీనియర్ న్యాయవాది మోసం చేశాడని ఫిర్యాదు నమోదైంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: