ఉద్యోగాలు కేసీఆర్‌ ఇస్తే.. సభలు రేవంత్‌ పెడతాడా?

Chakravarthi Kalyan
కేసిఆర్ ఇచ్చిన ఉద్యోగాలకు సీఎం రేవంత్ రెడ్డి సభు పెట్టుకుంటారా అని బీఆర్ఎస్‌ నేతలు ప్రశ్నిస్తున్నారు. సీఎం రేవంతరెడ్డి రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తా అని అధికారంలోకి వచ్చి రెండు నెలలు దాటినా ఇప్పటికి ప్రత్యేక కార్యాచరణ ఏమి లేదని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కేవలం 60 ఉద్యోగాలకు మాత్రమే ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చిందన్న బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్.. ఇంకా 1,99,940 ఉద్ద్యోగాలకు ఆర్థిక శాఖ నుండి ఎప్పుడు అనుమతి ఇస్తారో కార్యాచరణ ప్రకటించాలని డిమాండ్ చేశారు.
కేసిఆర్ ఇచ్చిన ఉద్యోగాలకు ఎల్.బీ. స్టేడియంలో సభ పెట్టుకొని రాజకీయాలు మాట్లాడటం బందు చేయాలని గెల్లు శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గతంలో కెసిఆర్ ఇచ్చిన నోటిఫికేషన్ ఫలితాలతో 16,027 పోలీస్ శాఖలో కానిస్టేబుల్ ఉద్యోగాలు..కేసిఆర్ ఇచ్చినవేనని ఎంపికైన అభ్యర్థులకు కూడా తెలుసని గెల్లు శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కేసిఆర్ ఇచ్చిన ఫలితాలకు, సీఎం రేవంత్ రెడ్డి సర్టిఫికెట్లు ఇచ్చి తనే ఇస్తున్నట్టుగా పోజులు కొడుతున్నారని గెల్లు శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

kcr

సంబంధిత వార్తలు: