చంద్రబాబు వస్తే ఆ జడ్జికి పదవి వస్తుందా?

Chakravarthi Kalyan
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వాతావరణం రోజురోజుకి ఆసక్తికరంగా మారుతోంది. వైసీపీ ఇన్ఛార్జిలను మార్చుతూ  సరికొత్త రాజకీయ ఎత్తుగడలకు శ్రీకారం చుట్టింది. మరోవైపు సరికొత్త పరిణామాలు సైతం చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే వైసీపీకి అనుకూలంగా మహి రాఘవ్ యాత్ర 2 సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా ఇటీవల విడుదలైంది. ఇక రాంగోపాల్ వర్మ తీసిన వ్యూహం సినిమా కూడా జగన్ కు అనుకూలంగా తీసిందే.

వైసీపీ తీరు ఇలా ఉంటే టీడీపీకి అనుకూలంగా రాజధాని ఫైల్స్ సినిమా తీశారు. దీంతో పాటు చంద్రబాబు జీవితం, ఆయన పరిపాలన దూరదృష్టి వంటి అంశాలపై సీనియర్ జర్నలిస్ట్ పూల విక్రం మహా స్వాప్నికుడు అనే పుస్తకాన్ని రూపొందించారు. ఇటీవల ఈ పుస్తకాన్ని సుప్రీం కోర్టు విశ్రాంత సీనియర్ న్యాయమూర్తి జస్టిస్  గోపాల్ గౌడ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జస్టిస్ గోపాల్ గౌడ  మాట్లాడుతూ.. ప్రజలే సారథులై చంద్రబాబుని గెలిపించాలని కోరారు.

మహిళలకు గౌరవం దక్కాలన్నా.. సామాజిక న్యాయం అందాలన్నా.. యువతకు ఉద్యోగాలు రావాలన్నా..రైతులకు న్యాయం జరగాలి అన్నాఏపీలో రాజకీయ మార్పు ఎంతో అవసరం అని చెప్పారు.  ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు మాలాంటి వాళ్లు మాట్లాడాలి. వారిని సరైన దారిలో నడిపించాలి. అందుకే మాట్లాడుతున్నా. చంద్రబాబు రాష్ట్ర రాజకీయాలకే కాదు. దేశ భవిష్యత్తుకు ఆయన నాయకత్వం ఎంతో అవసరం అని వ్యాఖ్యానించారు.

అయితే కొంతమంది విశ్రాంత ఐఎస్ లు, ఐపీఎస్ లు, న్యాయమూర్తులు పదవీ విరమణ తర్వాత పలు రాజకీయ పార్టీలకు అనుకూలంగా మాట్లాడుతుంటారు. ఎందుకంటే వారికి రిటైర్డ్ అయిన తర్వాత వచ్చే జీతం తక్కువగానే ఉంటుంది. దీంతో పాటు సమాజంలో గుర్తింపును కోరుకుంటారు. అందుకే ఏదోఒక రాజకీయ పార్టీ పక్షాన చేరతారు. ప్రస్తుతం జస్టిస్ గోపాల గౌడ కూడా అందులో భాగంగానే చంద్రబాబుకి అనుకూలంగా మాట్లాడారు అని విశ్లేషకులు అభిప్రాపయడుతున్నారు. ఒకవేళ టీడీపీ అధికారంలోకి వస్తే ఆయనకు కూడా ఏదో ఒక పదవి గ్యారంటీ అని పేర్కొంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: