నా దగ్గర ఆ ప్లానింగ్ లేదు.. అనిల్ రావిపూడి షాకింగ్ కామెంట్స్ వైరల్!
టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ దర్శకులలో ఒకరైన అనిల్ రావిపూడి, మెగాస్టార్ చిరంజీవి, నయనతార కాంబినేషన్ లో తెరకెక్కించిన 'మన శంకర వరప్రసాద్ గారు' మరికొన్ని రోజుల్లో థియేటర్లలో విడుదల కానుంది. ఫ్యామిలీ డ్రామాగా రూపొందిన ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అయితే, అనిల్ రావిపూడి తన సినిమాలను భిన్నంగా, ప్రత్యేకంగా ప్రమోట్ చేస్తారనే సంగతి తెలిసిందే. ఈ విషయంలో ఆయనకు ప్రత్యేకమైన శైలి ఉంది.
'మన శంకర వరప్రసాద్ గారు' మూవీ కేవలం 85 రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేసుకుందంటే దర్శకుడు అనిల్ రావిపూడి పని వేగం, ఆయన టాలెంట్ ఏంటో అర్థమవుతుంది. ఇంత తక్కువ సమయంలో ఇంత పెద్ద సినిమా షూటింగ్‌ను పూర్తి చేయడం మామూలు విషయం కాదు. అయితే, ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ ప్లాన్ ప్రస్తుతానికి తన దగ్గర లేదని అనిల్ రావిపూడి చెబుతున్నారు. చిరంజీవి సినిమాకు ప్రమోషన్స్ విషయంలో మరింత కొత్తగా, వినూత్నంగా ఆలోచించాలని ఆయన చెప్పుకొచ్చారు.
తాను కొత్త ఐడియాల కోసం వెతకాల్సిన అవసరం ఉందని ఆయన కామెంట్లు చేశారు. సాధారణంగా సంక్రాంతి పండుగకు ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలకు అడ్వాంటేజ్ ఉంటుంది. ఈ నేపథ్యంలో, అనిల్ రావిపూడి తన తాజా చిత్రంతో ఎలాంటి సరికొత్త కథాంశంతో, ప్రమోషన్ ప్లాన్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తారో చూడాల్సి ఉంది. మెగాస్టార్ చిరంజీవి సినిమా కావడం, సంక్రాంతికి విడుదల అవుతుండటంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ముఖ్యంగా చిరంజీవి మాస్ లుక్, నయనతార నటన ఈ చిత్రానికి హైలైట్‌గా నిలవనున్నాయని సినీ వర్గాల టాక్. అనిల్ రావిపూడి తన గత చిత్రాలైన 'ఎఫ్ 2', 'సరిలేరు నీకెవ్వరు' వంటి విజయాలతో ప్రేక్షకుల్లో మంచి అంచనాలను పెంచారు. ఈ సినిమాతో చిరంజీవి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.