కొత్త ట్రెండ్‌: వెళ్తూ వెళ్తూ జగన్‌పై అభాండాలు?

Chakravarthi Kalyan
వైసీపీ నుంచి వెళ్లిపోయే నేతలు ఇటీవల జగన్‌ పై పలు ఆరోపణలు చేస్తున్నారు. ముఖ్యమంతి వైఎస్ జగన్ హయాంలో బీసీలకు న్యాయం జరగడం లేదంటూ ఇటీవల వైసీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి ఆరోపణలు చేశారు. అయితే ఈ ఆరోపణలను వెంటనే ఉపసంహరించుకోవాలని మంత్రి చెల్లుబోయిన వేణు డిమాండ్ చేశారు. జంగా కృష్ణమూర్తిని వైకాపా అన్ని విధాలా గౌరవించి సమున్నత స్థానం ఇచ్చిందని, సీటు ఇవ్వలేదని టీడీపీలోకి వెళ్తే వెళ్లొచ్చని మంత్రి చెల్లుబోయిన సూచించారు.
టీడీపీలోకి వెళ్తూ సీఎం జగన్ పై  నిందారోపనలతో తన హోందాను తగ్గించుకోవద్దని కోరుతున్నట్లు మంత్రి చెల్లుబోయిన తెలిపారు. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు సామాజిక న్యాయం కోసం సీఎం పాటుపడుతున్నారని సీఎం జగన్ తీసుకున్న సంస్కరణల వల్ల జ్యోతిరావు పూలే సహా అంబేద్కర్, ఆశయాలతోనే సమసమాజం ఏర్పడుతుందని సీఎం జగన్ భావించారని మంత్రి చెల్లుబోయిన అన్నారు. మరో నాలుగు రోజుల్లో రాష్ట్రంలో కుల గణన పూర్తవుతుందని,తద్వారా బీసీల ఆత్మగౌరవం, మనో వాంఛను సీఎం  నెరవేర్చుతున్నారని మంత్రి చెల్లుబోయిన అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: