రోజా దోపిడీపై రెచ్చిపోయిన షర్మిల..?

Chakravarthi Kalyan
ఏపీ అంతా సుడిగాలిలా పర్యటిస్తున్న ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. చిత్తూరు జిల్లా నగరిలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ నగరి రోజా సొంత నియోజకవర్గం అన్న విషయం తెలిసిందే కదా. అందుకే అక్కడ రోజా పై షర్మిల ఎక్కువగా దృష్టి సారించారు. నగరిలో మంత్రి రోజా గ్రావెల్, ఇసుకను దోచుకుంటున్నారని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు.

అంతే కాదు.. ఉద్యోగుల పీఎఫ్‌ను దోచుకునేందుకు ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని షర్మిల అంటున్నారు. రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లవుతున్నా నగరిలో అభివృద్ధి ఏమీ జరగలేదని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వాపోయారు. ప్రత్యేక హోదా గురించి పాలకపక్షం, ప్రతిపక్షం పట్టించుకోలేదని షర్మిల అన్నారు. పదేళ్లలో మనకిచ్చిన ఒక్క వాగ్దానమైన కేంద్రం నెరవేర్చిందా? అని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. జగన్ పాలనలో రైతులకు అష్టకష్టాలు వచ్చాయన్న వైఎస్ షర్మిల.. పంటకు గిట్టుబాటు ధర లేదని.. అప్పు చేయని రైతు లేడని అన్నారు. నవరత్నాల్లో ఒకటైన జలయజ్ఞం అనే రత్నం ఏమైంద్న వైఎస్ షర్మిల.. గాలేరు-నగరిని 6 నెలల్లో పూర్తి చేస్తామన్నారు.. ఐదేళ్లుగా ఏం చేశారని నిలదీశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: