అమిత్‌షా అపాయిట్‌మెంట్‌ కోసం బాబు అన్ని తిప్పలా?

Chakravarthi Kalyan
అమిత్‌షా అపాయిట్‌మెంట్‌ కోసం చంద్రబాబు ఎన్నో తిప్పలు పడ్డారని నందమూరి లక్ష్మీపార్వతి అంటున్నారు. కేసుల భయంతో చంద్రబాబు బీజేపీలో పొత్తులు పెట్టుకోవడానికి తహతహలాడుతున్నాడని లక్ష్మీపార్వతి విమర్శించారు. చంద్రబాబు ఢిల్లీలో బీజేపీ పెద్దల్ని కలవాలని 25 సార్లు బ్రతిమిలాడుకుంటే ఒక మీడియేటర్‌ ద్వారా వారిని కలిశారనే ప్రచారం జరుగుతోందని లక్ష్మీపార్వతి అన్నారు. చంద్రబాబు తెలుగుదేశం పార్టీని హీనమైన పరిస్థితి దిగ‌జార్చాడ‌ని లక్ష్మీపార్వతి విమర్శించారు.
మహోన్నతమైన విలువలతో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపిస్తే చంద్రబాబు నాయుడు ఆయనను పార్టీ నుంచి బహిష్కరించాడ‌ని లక్ష్మీపార్వతి మండిప‌డ్డారు. కాంగ్రెస్ వ్యతిరేకంగా టీడీపీని స్థాపిస్తే మొన్న జరిగిన తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చంద్రబాబు సపోర్ట్ చేసి ఆయన శిష్యుడు రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేశాడని లక్ష్మీపార్వతి అన్నారు. నేడు కేసుల భయంతోనే బీజేపీతో పొత్తులు పెట్టుకోవడానికి తహతహలాడుతున్నాడని లక్ష్మీపార్వతి అన్నారు. బీజేపీకి చంద్రబాబు ఎంత డబ్బు అయినా ఇస్తానంటున్నాడని.. కేసుల నుంచి బయటపడేమయని పెద్దల్ని వేడుకుంటున్నాడని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: