ఆ ప్రాజెక్టులే రేవంత్‌ రెడ్డి టార్గెట్‌?

Chakravarthi Kalyan
రేవంత్ రెడ్డి సర్కారు కొన్ని ప్రాజెక్టులను టార్గెట్‌గా పెట్టుకుందని బడ్జెట్ ప్రసంగం రుజువు చేసింది. ఇదే విషయాన్ని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా తెలిపారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి త్వరితగతిన పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఎలిమినేటి మాధవరెడ్డి శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్, మహాత్మాగాంధీ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, జవహర్ నెట్టెంపాడు ఎల్‌ఐఎస్, రాజీవ్ భీమా ఎల్‌ఐఎస్, కోయిల్ సాగర్ ఎల్‌ఐఎస్, ఎస్‌ఆర్‌ఎస్‌పి-ఇందిరమ్మ ఫ్లడ్ ఫ్లో కెనాల్, జె చొక్కారావు దేవాదుల లిఫ్ట్ స్కీమ్ కొమరం భీం, చిన్న కాళేశ్వరం వంటి ఇతర ప్రాజెక్టులు చేపట్టనున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
 
తక్కువ ఖర్చుతో ఎక్కువ మేలు చేకూరే పనులను రేవంత్ సర్కారు టార్గెట్ గా పెట్టుకుంది. ఇప్పటికే అన్నారం, మేడిగడ్డ, సుందిళ్ళ బ్యారేజ్ ల నిర్మాణ నాణ్యత, అనాలోచిత డిజైన్లు, అవినీతిపై సమగ్ర విచారణకు ఇప్పటికే ఆదేశించామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.  తెలంగాణకు కృష్ణానది, గోదావరి నదిలో సరైన నీటి వాటాను సాధించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: