ఓటుకు నోటు.. రేవంత్‌రెడ్డికి శాపంగా మారుతుందా?

Chakravarthi Kalyan
ఓటుకు నోటు కేసు.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి శాపంగా మారుతుందా.. అంటే ఏమీ చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే.. ఇప్పుడు ఈ కేసు విచారణను వేరే రాష్ట్రానికి మార్చాలని బీఆర్‌ఎస్‌ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో ట్రయల్ ని నిలుపుదల చేస్తూ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కూడా ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. సిఎం రేవంత్‌ రెడ్డి తనపై 88 క్రిమినల్‌ కేసులు నమోదైనట్లు ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు.
అంతే కాదు.. అధికారం చేపట్టిన 100 రోజుల్లో గత ప్రభుత్వం చెప్పినట్లు విన్న పోలీసు అధికారులందరిని నగ్నంగా పరేట్‌ చేస్తా అని గతంలో రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వివరాలు కూడా సుప్రీంకోర్టుకు అందించారు. పిటిషనర్ వాదనలు పరిగణనలోకి తీసుకున్న అనంతరం రాష్ట్ర ప్రభుత్వానికి, వ్యక్తిగతంగా సీఎం రేవంత్ రెడ్డి, ఇతర ప్రతివాదులకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. అనూహ్యంగా కాలం కలిసొచ్చి సీఎం అయిన రేవంత్ రెడ్డికిఈ పాత కేసు శాపంగా మారుతుందా అన్నది చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: