కాంగ్రెస్‌ ప్లాన్‌ అంతా లీక్ చేసేస్తున్న జగ్గారెడ్డి?

Chakravarthi Kalyan
మొన్నటి తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బొటాబొటి మెజారిటీయే వచ్చింది. అందుకే ప్రభుత్వం పడిపోవచ్చని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. అయితే.. బీఆర్‌ఎస్‌ దగ్గరున్న 20 మంది ఎమ్మెల్యేలు మా దగ్గరకు వస్తారని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి అంటున్నారు. వారు నేరుగా ఆయా శాఖల మంత్రుల దగ్గరకు వెళ్తారని.. మీ పదేళ్ల పాలనలో మీ పార్టీలో ఎవరైనా కెసిఆర్ దగ్గరకు నేరుగా వెళ్ళారా.. వెళ్ళే అవకాశం ఇచ్చారా అని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి ప్రశ్నించారు.
మల్లారెడ్డి కూడా మా పార్టీలోకి రావొచ్చన్న కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి.. మీ పార్టీ నుంచి 20  నుంచి 25 మంది ఎమ్మెల్యేలు మా పార్టీలోకి వస్తారన్నారు. మీ పార్టీలో స్వేచ్ఛ లేదన్న కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి.. ఎమ్మెల్యేలందరూ ఆలోచనలో పడ్డారని.. ప్రభుత్వాన్ని పడగోడతాం అంటున్నారు.. పడగొట్టాడానికి ఇదేమైనా మేడిగడ్డ పిల్లరా అంటూ జగ్గారెడ్డి ఎద్దేవా చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: