షర్మిల తొలిసంతకం హామీ ఓట్లు కురిపిస్తుందా?

Chakravarthi Kalyan
ప్రత్యేక హోదా సాధించే వరకు షర్మిల ఇక్కడి నుంచి కదలదని ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అంటున్నారు. పోలవరం, రాజధాని, ప్రత్యేక హోదా కల సాకారం అయ్యేవరకు ఇక్కడే ఉంటానంటున్న వైఎస్‌ షర్మిల.. ఆలోచన చేయండి...రాహుల్ గాంధీ ప్రధాని అయ్యాక తొలి సంతకం ప్రత్యేక హోదా పై పెడతా అన్నారని గుర్తు చేస్తున్నారు. ఓట్ల సమయం వచ్చింది... ఓటు మీ చేతుల్లోని ఆయుధమంటున్న వైఎస్‌ షర్మిల.. ఓటు మీ బిడ్డల భవిష్యత్తును నిర్ణయించేదంటున్నారు.
అన్ని పార్టీలు డబ్బులు ఇస్తాయి...తీసుకోండి కానీ ఆలోచించి ఓటు వేయండంటున్న వైఎస్‌ షర్మిల.. సాండ్, లాండ్ మాఫియాతో మీ డబ్బులు దోచి మీకే ఇస్తారని.. కాంగ్రెస్ కి ఓటేస్తే....ఆంధ్ర రాష్ట్ర హక్కులు కాపాడుకోవచ్చని అంటున్నారు. ఆరోజు జగన్ 25వేల ఉద్యోగాలతో మెగా డీఎస్సీ వేస్తామన్నారని.. ఇప్పుడు కేవలం ఎన్నికలు వస్తున్నాయని 6వేల ఉద్యోగాలతో దగా డీఎస్సీ ఇచ్చారని వైఎస్‌ షర్మిల విమర్శించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: