మోదీ, అమిత్‌షాకు జగన్‌ పూర్తిగా లొంగిపోయారా?

Chakravarthi Kalyan
మోదీ, అమిత్‌ షాకు జగన్ పూర్తిగా లొంగిపోయారని కాంగ్రెస్ ఎంపీ, ఏపీ కాంగ్రెస్ ఇంఛార్జ్ మాణికం ఠాగూర్ విమర్శించారు. కేసుల కోసమే జగన్‌, విజయసాయి భాజపాకు లొంగారన్న మాణికం ఠాగూర్.. జగన్‌ కేంద్రం నుంచి రాష్ట్రానికి ఏమీ సాధించలేదన్నారు. విజయసాయిపై రాజ్యసభ ఛైర్మన్‌కు కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాకూర్ ఫిర్యాదు చేశారు. రాజ్యసభలో విజయసాయి నాపై ఆరోపణలు చేశారని.. లోక్‌సభ సభ్యుడి గురించి రాజ్యసభలో మాట్లాడటం సరికాదని.. ఇది సభాహక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని మాణికం ఠాగూర్ తెలిపారు.
ప్రత్యేక హోదాపై విజయసాయి మోదీని అడగట్లేదని.. 2019 నుంచి అన్ని బిల్లులకు జగన్ మద్దతు ఉందని మాణికం ఠాగూర్ అన్నారు. అన్ని ప్రజావ్యతిరేక బిల్లులకు జగన్ మద్దతు ఇచ్చారన్న మాణికం ఠాగూర్.. సభలో వైకాపా మద్దతిస్తుంది.. బయట వ్యతిరేకిస్తుందన్నారు. భాజపాకు జగన్ ఏటీఎంలా మారారని మాణికం ఠాగూర్ ఎద్దేవా చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: