హరీశ్‌రావుకు అడ్డంగా దొరికిపోయిన రేవంత్‌?

Chakravarthi Kalyan
తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి పోతిరెడ్డిపాడు జీవో విడుదల సమయంలో హరీశ్‌రావు మంత్రిగా ఉన్నారంటూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. వాస్తవానికి తాము అప్పటికే రాజీనామా చేసి మూడు నెలలు అయ్యిందని హరీశ్ రావు చెబుతూ రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు ఔట్ లెట్ల స్వాధీనం విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది మితిమీరిన అహంకారం, సంస్కారం లేని భాష, వితండవాదం తప్ప ఏమీ లేదని హరీష్ రావు ఆక్షేపించారు.
2005 జూలైలో మంత్రి పదవులను గడ్డిపోచల్లా వదులుకొని రాజీనామాలు చేసినట్లు హరీశ్ రావు వివరించారు. తాము రాజీనామాలు చేసిన మూడు నెలల తర్వాత వైఎస్ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు ఉత్తర్వులు తీసుకొచ్చిందన్న ఆయన... కాంగ్రెస్, తెలుగుదేశం నేతలు పెదవులు మూసుకుంటే తాము, పీజేఆర్ కలిసి కొట్లాడామని హరీశ్ రావు తెలిపారు. ఒక ముఖ్యమంత్రి ఇంత పచ్చిగా అబద్ధాలు ఎలా చెబుతారని ప్రశ్నించిన ఆయన... విషయం లేక విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: