చంద్రబాబుపై సీబీఐ విచారణ.. కోరగలడా?

Chakravarthi Kalyan
తనపై ఉన్న కేసుల్లో సీబీఐ విచారణ కోరగలవా చంద్రబాబూ.. అంటూ మంత్రి కాకాణి గోవర్థన్‌ రెడ్డి సవాల్‌ విసిరాడు. పద్నాగేళ్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాపై నిందలు వేస్తూ అనేక బహిరంగ సభల్లో మాట్లాడారని.. బురదజల్లేద్దాం..అతనే కడుక్కుంటాడు అన్నట్లుగా మాట్లాడిన చంద్రబాబు లాంటి వారి మాటలకు విలువ ఉందా అని మంత్రి ప్రశ్నించారు. తాను చంద్రబాబును అడుగుతున్నా...ఇక నువ్వు మాట్లాడే మాటల్లో విలువ ఉంటుందా.. నేను చాలా సార్లు చెప్పా..నేను సీబీఐ విచారణకు అంగీకరించా..నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ మీద ఉన్న కేసుల్లో సీబీఐ విచారణకు సిద్ధమా అంటూ మంత్రి సవాల్ విసిరారు.
ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు నుంచి స్కిల్‌ కేసు, ఇన్‌సైడర్‌ ట్రేడింగ్, మద్యం కుంభకోణం వంటి వాటిలో నీ పాత్ర లేదంటూ వాటిపై సీబీఐ విచారణకు సిద్ధమా అని మంత్రి కాకాణి గోవర్థన్‌ రెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబుకు ధైర్యం లేదని.. కోర్టులకు వెళ్లి వాటిని అపుకున్నది అందరూ చూశారని.. నేను అవినీతి పరుడ్ని కాదు..నేను సీబీఐ విచారణకు సిద్ధపడ్డానని చంద్రబాబు చెప్పగలడా అని మంత్రి ప్రశ్నించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: