కేజీ రూ. 29: భారత్‌ రైస్‌ అంటే రేషన్‌ బియ్యమేనా?

Chakravarthi Kalyan
భారత్‌ రైస్‌ పేరుతో కేంద్రం బియ్యం అమ్మబోతోంది. కేజీ 29 రూపాయల చొప్పున ధర నిర్ణయించింది. అయితే ఈ బియ్యం నాణ్యత ఎలా ఉంటుందో తెలియదు. రేషన్ ద్వారా ఇస్తున్న బియ్యం పెద్దగా ఎవరు వాడటం లేదన్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పందించారు. భారత్ రైస్ 29 రూపాయలకే కేజీ అనేది హాస్యాస్పదంగా ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎద్దేవా చేశారు. రేషన్ ద్వారా ఉచితంగా వస్తున్న బియ్యాన్నే.. భారత్ రైస్ పేరిట 29 రూపాయలకు కేజీ ఇస్తే ఎలా అని తుమ్మల నాగేశ్వరరావు ప్రశ్నించారు. సన్న బియ్యం 29 రూపాయలకు కేజీ ఇస్తే సంతోషమన్న తుమ్మల నాగేశ్వరరావు. దేశానికి అన్నం పెట్టే స్థానంలో తెలంగాణ ఉందన్నారు.

మేలైన వరి ఎగుమతులు కూడా చేసే విధంగా ఇందులో చర్చ ఉంటుందని తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఏ దేశానికి ఏ రకం బియ్యం అవసరమో ముందే డిమాండ్ కేంద్రం వెల్లడిస్తే ఎగుమతులకు ఆస్కారం ఉంటుందని తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: