రేపే రేవంత్ క్యాబినెట్ మీటింగ్.. ఇదే కీలక అజెండా?
ఆ రెండు పథకాలతో పాటు గత ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలపై కూడా కేబినెట్ మీటింగ్‌లో చర్చ జరిగే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సిద్ధం చేసింది. ఈనెల 8 నుంచి బడ్జెట్ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. ఈనెల 8న ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ఉంటుంది. 9న గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ జరుగుతుంది.