ఆహో..ఓహో అంటూ పరువు తీసుకున్న జనసేన?

Chakravarthi Kalyan
నిన్న కేంద్రం మధ్యంతర బడ్జెట్‌ ప్రవేశ పెట్టింది. ఎన్నికల ఏడాది కాబట్టి ఓటాన్‌ అకౌంట్‌ మాత్రమే పెట్టారు. ఇందులో పెద్దగా నిర్ణయాలు ఏమీ ఉండవు. అందుకు తగ్గట్లే ఎలాంటి మెరుపులు లేకుండా నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. దీనిపై విపక్షాలు పెదవి విరిచాయి. అయితే..  కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన మభ్యంతరం బడ్జెట్ భవిష్యత్తు భారతానికి ఒక దిక్సూచి అంటూ జనసేస స్పందించి పరువు తీసుకుంది.
అంతే కాదు..ఈ బడ్జెట్‌ పర్యాటక రంగానికి పెద్దపీట వేసిందని.. పేదలకు ఇల్లు నిర్మాణం విషయంలో కేంద్రం ప్రభుత్వం అండగా ఉంటామని చెప్పడం హర్షించదగిన పరిణామం అంటూ ఆ పార్టీ నేతలు స్పందించారు. అలాగే రైతులు, యువత, మహిళలకు స్వాంతన చేకూర్చే కొన్ని పథకాలను ప్రవేశ పెట్టడం బాగుందంటూ మెచ్చుకున్నారు. సౌర విద్యుత్తును ప్రోత్సహించేలా 300 యూనిట్ల కరెంటును ఉచితంగా అందించే పథకం అభినందనీయమని ప్రకటించారు. ఈ స్థాయిలో బడ్జెట్‌ను పొగడటం చూసి ఔరా అనుకుంటున్నారంతా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: