పంజాగుట్ట్ పీఎస్‌కు అంత షాక్‌ ఎందుకంటే?

Chakravarthi Kalyan
పంజాగుట్ట ఠాణాలో పనిచేస్తున్న 85 శాతం మంది పోలీసులను బదిలీ చేస్తూ హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్‌ రెడ్డి నిన్న సంచలన నిర్ణయం తీసుకున్నారు. 130 పైగా సిబ్బంది ఉంటే 86 మందిని బదిలీ చేశారు. ఇందులో 82 మందికి పోస్టింగ్‌ ఇచ్చారు. నలుగురికి ఎలాంటి పోస్టింగ్ ఇవ్వలేదు. ఇన్‌స్పెక్టర్‌ స్థాయి నుంచి హోంగార్డు వరకు అందర్నీ బదిలీ చేశారు. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. కొన్ని రోజులుగా పంజాగుట్ట స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకున్న ఘటనల ఆధారంగానే బదిలీలు జరిగాయి.

ఇటీవల అమీర్‌ అలీ అనే వ్యక్తి కారుతో పంజాగుట్టలో బీభత్సం సృష్టించి పారిపోయాడు. అలాగే మాజీ ఎమ్మెల్యే కొడుకు రాహిల్ ఇష్యూ కూడా బాగా చెడ్డపేరు తెచ్చింది. అలాగే పెట్రోలింగ్‌ సమయంలో కానిస్టేబుళ్లు మద్యం సేవిస్తూ పట్టుబడ్డారు. అంతే కాదు..  ఎస్‌ఐ మహిళా బాధితురాలితో అనుచిత ప్రవర్తించినట్టు ఆరోపణలు వచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: