బీఆర్‌ఎస్‌ సోషల్ మీడియా.. దిసీజ్‌ టూమచ్‌?

Chakravarthi Kalyan
బీఆర్‌ఎస్‌ పార్టీకి సంబంధించిన కొంతమంది సోషల్ మీడియా వీరులు కరెంటు స‌ర‌ఫ‌రా పైన తప్పుడు ప్రచారం చేస్తూ రాష్ట్ర ప్రజలను తప్పుదోవ ప‌ట్టిస్తున్నార‌ని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో నాణ్యమైన విద్యుత్తుతో పాటు ఎటువంటి కోత‌లు లేకుండా నిరంతరం విద్యుత్తు సరఫరా చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం చీకట్లో ఉండాలని కలలు కంటున్న బీఆర్ఎస్‌ సోషల్ మీడియా వీరుల ఆశలను, అసలు స్వరూపాన్ని ప్రజలు గమనిస్తున్నారని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఎద్దేవా చేశారు.

విద్యుత్ సరఫరా విషయంలో సోషల్ మీడియాలో వ‌స్తున్న తప్పుడు వార్తలు, వదంతులను నమ్మవద్దని భట్టి విక్రమార్క  ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గత ఏడాది జ‌న‌వ‌రి కంటే 2024 జ‌న‌వ‌రిలో ఎక్కువ‌గా విద్యుత్తు స‌ర‌ఫ‌రా జ‌రిగింద‌ని ఇందుకు సంబంధించిన గ్రాఫ్‌ను విడుద‌ల చేశామన్న భట్టి విక్రమార్క నకిలీ నేతలు, సోషల్ మీడియా నేతలు తెలంగాణలో విద్యుత్తు కోత‌లు ఉంటే బాగుంటుందని కలలు కంటున్నారన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

brs

సంబంధిత వార్తలు: