ఇవాళ ఉస్మానియా వర్శిటీలో అదిరే కార్యక్రమం?

Chakravarthi Kalyan
కేంద్ర సాంస్కృతిక పర్యాటకశాఖ అధ్వర్యంలో ఇవాళ ఉస్మానియా యూనివర్శిటీలోని ఆర్ట్స్‌ కాలేజీలో లైట్ అండ్ సౌండ్ షో నిర్వహించనున్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో తెలంగాణ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, హైదరాబాద్ ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు తదితరులు పాల్గొంటారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దీన్ని ప్రారంభిస్తారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవతో సెంట్రల్ ఏజెన్సీలకు అందించే సాయం పథకంలో భాగంగా భారత పర్యాటక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ లైట్ అండ్ సౌండ్, లేజర్ షో నిర్వహిస్తున్నారు. ఈ షోలో 1917 నుంచి ఇప్పటి వరకు వందేండ్ల ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ చరిత్రను అద్భుతంగా టెక్నాలజీ సహాయంతో వివరిస్తారు.

ఉస్మానియా యూనివర్సిటీ చరిత్ర కథను పురవాస్తు శాఖ అందించింది. చరిత్ర కు సంబంధించిన వాయిస్ఓవర్ ను ప్రముఖ సినీ నటుడు సాయి కుమార్ అందించారు. ఎలాంటి చార్జీలు వసూలు చేయకుండా ఉచితంగా ఈ ప్రదర్శనను అంతా తిలకించవచ్చు. యూనివర్సిటీ చరిత్ర తెలుసుకునేందుకు విద్యార్థులకు ఇదో గొప్ప అవకాశంగా ఉంటుందని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ou

సంబంధిత వార్తలు: